Tuesday, 3 November 2026

రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్ష ప్రారంభం

హైదరాబాద్ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరడానికి ఉద్దేశించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రారంభమైంది. సెట్-బి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 263 పరీక్షా కేంద్రాల్లో జరిగే ఐసెట్ ప్రవేశ పరీక్షకు 1,42,464 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మే 26న ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలను జూన్ మూడో తేదీ దాకా స్వీకరిస్తారు. జూన్ తొమ్మిదో తేదీన ఫలితాలు విడుదల చేస్తారు.
Topics: ఐసెట్, ప్రవేశ పరీక్ష, ఎంబిఎ, ఎంసిఎ, ICET, entrance exam, MBA, MCA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *