న్యూఢిల్లీ : బిజెపి తదుపరి అధ్యక్షునిగా పార్టీ నాయకుడు జగత్ ప్రకాశ్ నడ్డా పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. శుక్రవారం ఉదయం ఇక్కడ గుజరాత్ భవన్‌లో అమిత్ షాతో కలిసి ఆయన కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్న పక్షంలో నడ్డా ఆ పదవిని చేపట్టవచ్చని వారు తెలిపారు. అదే సమయంలో కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం ఎంపీలు మోడీని కలవడానికి బారులు తీరడంతో గుజరాత్ భవన్ వద్ద కార్యకలాపాలు జోరందుకున్నాయి.
Related