న్యూఢిల్లీ: కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్ మూడు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.




