Monday, 2 November 2026

ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ

 న్యూఢిల్లీ, మే 27 : నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రి మంగళవారం ఉదయం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం 9 గంటలకు ప్రధాన మంత్రి కార్యాలయంలో అడుగుపెట్టిన మోదీ మొదటగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రధాని కుర్చీలో ఆసీనులయ్యారు. పీఎంవో అధికారులు అందజేసిన మొదటి ఫైల్‌పై నరేంద్ర మోదీ సంతకం చేయడంతో ఆయన లాంచనంగా ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత మోదీ నేరుగా హైదరాబాద్ హౌస్‌కు వెళ్లారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చిన సార్క్ దేశాధిపతులతో మోదీ సమావేశంకానున్నారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది. మరోవైపు కేంద్ర మంత్రుల శాఖను రాష్ట్రపతి భవన్ ఈ ఉదయం అధికారికంగా ప్రకటించింది.
కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు :
* రాజ్‌నాథ్ సింగ్ – హోంశాఖ
* సుష్మాస్వరాజ్ – విదేశీ వ్యవహరాలు
* అరుణ్‌జైట్లీ – రక్షణ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహరాలు
* వెంయ్యనాయుడు – పట్టణాభివృద్ధి హౌసింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
* నితిన్ గడ్కరీ – రవాణా శాఖ
* సదానందగౌడ – రైల్వేశాఖ
* ఉమాభారతి – జలవనరులు, గంగా ప్రక్షాళన
* నజ్మా హెస్తుల్లా – మైనార్టీ వ్యవహారాలు
* గోపీనాథ్ ముండే – గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
* రామ్ విలాస్ పాశ్వాన్ – ఆహార, పౌరసరఫరాలు
* కల్రాజ్ మిశ్రా – చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
* మేనకాగాంధీ – స్త్రీ, శిశు సంక్షేమం
* అనంతకుమార్ – రసాయనాలు, ఎరువుల శాఖ
* రవిశంకర్‌ప్రసాద్ – న్యాయ, సమాచార ప్రసార శాఖ
* అశోక్‌గజపతిరాజు – పౌరవిమానయానం
* అనంత్ గీతె – భారీ పరిశ్రమలు
* హరిసిమ్రాత్‌కౌర్ బాదల్ – ఫుడ్ ప్రాసెసింగ్
* నరేంద్రసింగ్ తోమర్ – గనులు, స్టీల్, కార్మిక, ఉపాధి
* జ్యూయల్ ఓరమ్- గిరిజన సంక్షేమం
* రాధా మోహన్‌సింగ్ – వ్యవసాయం
* థావర్‌చంద్ గెహ్లూట్ – సామాజికన్యాయం, సాధికారత
* స్మృతి ఇరానీ – మానవవనరులు
* హర్షవర్ధన్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
* వీకే సింగ్ – విదేశాంగ సహాయమంత్రి
* ఇంద్రజీత్‌సింగ్ రావ్ – ప్లానింగ్ సహాయ
* గంగ్వార్ – టెక్స్‌టైల్స్, జలవనరుల సహాయ
* శ్రీపాద్‌నాయక్- సాంస్కృతికం, పర్యాటకం
* ధర్మేంధ్ర ప్రదాన్ – పెట్రోలియం(స్వతంత్ర)
* శర్వానంద్ సోనోహల్ – యువజన వ ్యవహారాలు, క్రీడల
* ప్రకాశ్ జవదేకర్ – అటవీ పర్యావరణ(స్వతంత్ర)
* పీయూష్ గోయల్ – విద్యుత్, బొగ్గు(స్వతంత్ర)
* జితేంద్రసింగ్ – సైన్స్ అండ్ టెక్నాలజీ(స్వతంత్ర)
* నిర్మలా సీతారామన్ – వాణిజ్యశాఖ (స్వతంత్ర)
సహాయ మంత్రులు :
* జీఎం సిద్దేశ్వర – పౌరవిమానయానం
* మనోజ్ సిన్హా – రైల్వే శాఖ సహాయమంత్రి
* నిహాల్‌చంద్ – ఎరువులు, రసాయనాలు సహాయమంత్రి
* ఉపేంద్ర కుష్వాహా – గ్రామీణాభివృద్ధి
* పి. రాధాకృష్ణన్ – భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు
* కిరెన్ రిజిజు – హోంశాఖ సహాయమంత్రి
* క్రి ష్ణన్ పాల్ – రోడ్డు రవాణా, హైవే, షిప్పింగ్
* సంజీవ్‌కుమార్ బాలియా – వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్
* మున్‌సుఖ్ వసవ – గిరిజనసంక్షేమం సహాయ
* రావ్ సాహెబ్ దాన్వే – వినియోగదారుల వ్యవహరాలు, పీడీఎస్
* విష్ణుదేవ్‌సాయి – గనులు, స్టీల్, కార్మిక, ఉపాధి
* సుదర్శన్ భగత్ – సామాజిక న్యాయం,సాధికారత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *