Monday, 2 November 2026

సార్క్ నేతలతో మోడి భేటీ

న్యూఢిల్లీ): ప్రధానమంత్రి నరేంద్ర మోడి మంగళవారం నాడిక్కడ ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సతో సమావేశమయ్యారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిపిన తొలి అధికారిక సమావేశం ఇదేనని అధికారులు చెప్పారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశాలలో భాగంగా మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రంగూలమ్‌తో పాటు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కూడా భేటీ కానున్నారు. ఒక నిర్ణీత అజెండా లేకుండా జరిగిన ఈ భేటీలను ‘మర్యాదపూర్వకమై సమావేశాలు’గా అధికారులు అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *