Monday, 2 November 2026

గండిపేటలో ప్రారంభమైన టిడిపి మహానాడు

హైదరాబాద్: టిడిపి 33వ మహానాడు సమావేశాలు గండిపేటలోని తెలుగు కుటీరంలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో టిడిపి నేతలు, కార్యకర్తలు మహానాడులు తరలి వస్తున్నారు. తొలిరోజు మహానాడు సభలో పలు కీలక తీర్మానాలు, పాలన, తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణంలో టిడిపి నేత నన్నపనేని రాజకుమారి ప్రతి సారిలాగానే ఈ సారి కూడా ఎన్‌టిఆర్, చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాలను ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. సమావేశానికి నందమూరి హరికృష్ణ కూడా హాజరయ్యారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *