Monday, 2 November 2026

కేంద్ర మంత్రి మండలి తొలి సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయంలో  కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై చర్చిస్తారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్ధేశం చేస్తారు. రాష్ట్ర విభజన అంశం గురించి ఉన్నతాధికారులు కేంద్ర కేబినెట్కు వివరిస్తారు. తొలి సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *