Monday, 2 November 2026

తీవ్రవాదం నియంత్రణపైనే రెండు దేశాల చర్చ:భారత్

న్యూఢిల్లీ : భారత ప్రధాని మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన చర్చల సారాంశంపై భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ విడుదల చేసిన ప్రకటనలోని సారాంశం… ‘తీవ్రవాదం నియంత్రణపైనే రెండు దేశాలు చర్చించాయి. తీవ్రవాదంపై మన దేశ ఆందోళనను మోడీ పాక్‌కు తెలిపారు. తీవ్రవాద నియంత్రణకు పాకిస్థాన్ గట్టి చర్యలు తీసుకోవాలని మోడీ కోరారు. ముంబయి దాడుల కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై మోడీ, నవాజ్ చర్చలు జరిపారు.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *