Monday, 2 November 2026

దేశంలోనే ధనవంత రాష్ట్రంగా తెలంగాణ :కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ధనవంత రాష్ట్రంగా తయారు చేద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారన్నారు. మనకు బాస్‌లెవరూ లేరని.. తెలంగాణ ప్రజలే మనకు బాస్‌లని స్పష్టం చేశారు. ఎవరికి ఏ చిన్న సమస్య ఉన్నా తనకే చెప్పొచ్చని తెలిపారు. తాను ఇంతకు ముందు ఎట్లున్ననో ఐదేళ్లు కూడా అట్లానే ఉంటానని ఉద్ఘాటించారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని మన సామర్థ్యమేంటో నిరూపించుకుందామని ప్రజలకు సూచించారు. తెలంగాణను బంగారు తెలంగాణాగా తీర్చి దిద్దడమే తమ ధ్యేయమని పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *