Monday, 2 November 2026

ప్రపంచానికి భారత్‌ సత్తాను చాటారు : మోడీ

హైదరాబాద్‌ : మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి భారత్‌ సత్తాను చాటారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి23 ప్రయోగం విజయవంతమైన అనంతరం ప్రధాని మాట్లాడారు. సొంత నావిగేషన్‌ వ్యవస్థకు ఇది దోహదపడుతుందని అన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో మనది సుదీర్ఘ ప్రయాణమని.. పీఎస్‌ఎల్‌వీ ఇప్పటివరకు 67 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిందని చెప్పారు. శాస్త్రవేత్తల కృషిని వృథా కానివ్వమని.. ఈ ఫలితాన్ని ప్రజలకు చేరవేస్తామని తెలిపారు.
శాటిలైట్‌ ప్రయోగాలను మరింత విస్తరించాలి
శాటిలైట్‌ ప్రయోగాలను మరింత విస్తరించాలని ప్రధాని నరేంద్రమోడీ ఇస్రో శాస్త్రవేత్తలను కోరారు. భారీ ఉపగ్రహాలను విరివిగా ప్రయోగించే స్థాయికి ఎదగాలని సూచించారు. సార్క్‌ దేశాల కోసం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించి కానుకగా ఇద్దామన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ23 విజయవంతంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిందని తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంలో మన శాస్త్రవేత్తలు మనల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని అభినందించారు. కె. రాధాకృష్ణన్‌ బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

గొప్ప విజయానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు గర్వపడుతున్నా..
హైదరాబాద్‌ : పీఎస్‌ఎల్‌వీ-సి23 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్రమోడీ షార్‌ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రయోగం విజయవంతమైన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. అనుకున్నట్టుగా, కచ్చితంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని.. ఈ గొప్ప విజయానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు గర్వపడుతున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *