
హైదరాబాద్, జులై 10 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులు గత అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. మలేరియా, రవాణా, పార్కుల విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నాయి. వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెతో నగరంలోని పలు విభాగాల్లో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి. మరోవైపు కార్మికులు తక్షణమే సమ్మెను విరమించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ సోమేష్‌కుమార్ హెచ్చరించారు.




