సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్నబోనాల గ్రామానికి చెందిన పరిగె దేవయ్య(60) అనే రైతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం దేవయ్య తనకున్న నాలుగెకరాలతోపాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని మొత్తం పదెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. పెట్టుబడుల కోసం లక్షా యాబ’్ఞయవేలు అప్పు తెచ్చి పెట్టాడు. గతంలో చేసిన మరో లక్ష రూపాయలు అప్పు అలాగే ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు చూసి తీవ్ర మనోవేదనకు గురైన దేవయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




