న్యూఢిల్లీ: ఐదో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్టాప్ పోలవరం, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు ఒడిషా, చత్తీస్‌గఢ్ ఎంపీలు గళం కలపడంతో లోక్‌సభ ఆందోళనలతో దద్దరిల్లుతోంది.




