ధర్మపురి(తమిళనాడు): ధర్మపురి జిల్లాలోని ఒక దళిత కాలనీలో నక్సలైట్లుగా అనుమానిస్తూ అరెస్టు చేసిన ఆరుగురిని పోలీసులు జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఎ) కింద నిర్బంధంలోకి తీసుకున్నారు.జి. శంకర్(36), ఎస్.శక్తి(36), ఎం.దురై(47), జి.అశోకన్(30), ఎస్.ఆదియమన్(30), సి.సంతోష్(20)లను ఎన్ఎస్ఎ కింద అదుపులోకి తీసుకోవలసిందిగా ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ కె. వివేకానందన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.జూన్ 28న అరెస్టు చేసి సేలం సెంట్రల్ జైలులో ఈ ఆరుగురిని ఉంచారు. వీరంతా పొరుగు రాష్ట్రాలలో మావోయిస్టుల నుంచి శిక్షణ పొందారని పోలీసులు చెప్పారు. ఆ వార్తల ఆధారంగా వీరిని ఎన్ఎస్ఎ కింద అదుపులోకి తీసుకోవాలని ధర్మపురి పోలీసు సూపరింటెండెంట్ అస్రా గర్గ్ సిఫార్సు మేరకు కలెక్టర్ ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు పోలీసులు చెప్పారు.ఈ నక్సలైట్లు ఇక్క ఒక శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి పథకం వేశారని వారు తెలిపారు. నాదమ: కాలనీలో వీరిని అరెస్టు చేశారు. ఇదే కాలనీలో 2012లో ఒక దళిత యువకుడికి, ఒక హిందువు యువతికి మధ్య జరిగిన వివాహం మూడు గ్రామాలలో హింసాకాండకు దారితీసింది. గత ఏడాది జూలై 4న రైలు పట్టాల కింద దొరికిన ఇ. ఇళవరసన్ అనే ఆ దళిత యువకుడి మృతదేహాన్ని ఖననం చేసిన స్మశాన వాటిక సమీపంలోనే నాదమ్ కాలనీ ఉంది.