మేళ్లచెరవు, నల్గొండ: పులిచింతల వద్ద నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రం వద్ద కూలీలు కాంక్రీట్ పనులు నిర్వహిస్తుండగా ఆ పక్కనే ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా మీద పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వారిలో నలుగురు కూలీలు, మరొకరు జెన్‌కో కాంట్రాక్టర్ ఉన్నారు. కాంట్రాక్టర్ గోపాలకృష్ణ(42) కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారు. కూలీ గోవింద్‌రెడ్డి నేలచెరవు మండలానికి చెందినవాడు కాగా నందు(20) మధ్యప్రదేశ్‌వాసి. సుబ్బు(35) బెంగాలీ. మరో మృతదేహం శిథిలాల్లో ఇరుక్కొని ఉంది. అది మధ్యప్రదేశ్ వాసి జావేద్‌గా అనుమానిస్తున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజ్‌గోపాల్, సూర్యాపేట డీఎస్పీ శ్రవణ్‌కుమార్ సంఘటనాస్థలిని పరిశీలించారు.




