న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు 80వ పుట్టినరోజు దనమైనప్పటికీ బుధవారం సాధారణ రోజుగానే సాగిపోయింది. ఆయన తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) 70 వ్యవస్థాపక దినోత్సవానికి హాజరుకావడం ద్వారా ప్రధాని తన రోజువారీ కార్యకలాపాలు ప్రారంభించారు. అక్కడే ఆయన తన పుట్టినరోజును ప్రస్తావించారు.




