Tuesday, 3 November 2026

బికనీర్‌ జైల్లో గొడవ

ముగ్గురు ఖైదీల మృతి
హైదరాబాద్‌: రాజస్థాన్‌లోని బికనీర్‌లో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు ఖైదీలు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం గురువారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో ఒకరిపై ఒకరు కాల్చుకున్నారని, ఈ ఘటనలో బల్బీర్‌ బనుడా, జైప్రకాశ్‌, రాంపాల్‌ అనే ముగ్గురు ఖైదీలు మృతిచెందారని పోలీసులు తెలిపారు. జైలు సూపరింటెండెంట్‌ సరేంద్రసింగ్‌ను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *