హైదరాబాద్: క్రైస్తవులకు చట్టసభల్లో ప్రాతినిధ్యంపై చిత్తశుద్ధితో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని క్రైస్తవులకు కేటాయిస్తామని చెప్పారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లే… క్రిస్‌మస్‌కు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చిల నిర్మాణానికి కలెక్టర్ల అనుమతి లేకుండా ప్రత్యేక ఉత్తర్యూలు జారీ చేస్తామన్నారు. క్రైస్తవులకు 3 శాతం రిజర్వేషన్లు వచ్చేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. మత ప్రచారకులు, ఫాస్టర్లపై దాడి జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.




