హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రవేశద్వారాన్ని ఓ వ్యక్తి పగులగొట్టాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వేకువజామున ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. అసెంబ్లీ భవనానికి మూడంచెల భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనా స్థలాన్ని డీసీపీ కమలాసన్‌రెడ్డి పరిశీలించారు. అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ భద్రతా వ్యవస్థ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టాలు చేసే శాసనసభకే రక్షణ లేకపోతే సామాన్యుడికి ఏం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.




