సదాశివపేట: ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన మెదక్‌జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆత్మకూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి ఉదయ్‌కుమార్ బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తూ వెనుక టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేయడంతో వారు పరారయ్యారు. సంగారెడ్డి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఇందూరు ప్రాజెక్టు నుంచి సదాశివపేటకు వస్తుండగా ఆత్మకూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.




