Monday, 2 November 2026

డాన్స్ మాస్టర్, నటుడు ముక్కురాజు కన్నుమూత

పగో, జులై 31 : అలనాటి మేటినటుడు, డ్యాన్స్ మాస్టర్ సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు కన్నుమూశారు. కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 600 సినిమాల్లో ముక్కురాజు నటించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ముక్కురాజు సినిమాలు చేస్తునే ఉన్నారు. 2010లో వచ్చిన ‘1940లో ఓ గ్రామం’ అనే చిత్రంలో నటించిన ముక్కురాజుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2013 ముక్కురాజు చివరి సారిగా మధసింహం అనే చిత్రంలో నటించారు. ముక్కురాజు భార్య, ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. రేపు(శుక్రవారం) ఉండి మండలం చెరుకువాడలో ముక్కురాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *