న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ర్టాలకు కేటాయించాల్సిన సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపు పూర్తయింది. ఇవాళ నార్త్ బ్లాకులో సమావేశమైన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆధ్వర్యలో సమావేశం జరిగింది. ఈమేరకు కమిటీ లాటరీ ప్రక్రియ ద్వారా అధికారులను కేటాయించింది. మొదటగా తెలంగాణ పేరు లాటరీలో రావడంతో రోస్టర్ విధానాన్ని తెలంగాణ నుంచే అమలు చేశారు. రెండు రాష్ర్టాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టులను లాటరీ ద్వారానే నిర్ణయించారు.
తెలంగాణకు ఐఏఎస్-163, ఐపీఎస్-112, ఐఎఫ్‌ఎస్-65 మంది అధికారులను కేటాయించారు. ఏపీకి ఐఏఎస్-211, ఐపీఎస్-144, ఐఎఫ్‌ఎస్-85 మంది అధికారులను కేటాయించారు. వచ్చే శనివారంలోగా ఈ కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని రేమాండ్ పీటర్ పేర్కొన్నారు.




