రేపుమధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌లో భేటీ

హైదరాబాద్, ఆగష్టు 16 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. 48 గంటల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంలతో పాటు రెండు రాష్ట్రాల స్పీకర్లు, చీఫ్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు సమావేశం జరుగనుంది.
విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.అవి పరిష్కారం కాకపోవడంతో చర్చలకు సిద్ధమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న(శుక్రవారం) రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో సీఎంలు ఇద్దరు కలిశారు. గవర్నర్ మరింత చొరవ తీసుకుని ముందుగా వీరి మధ్య సంప్రదింపులకు సహృద్భావ వాతావరణం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే భేటీ ప్రాముఖ్యం సంతరించుకుంది.




