మూడు లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు, మెదక్ లోక్‌సభ, నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక
ఆగష్టు 20న ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. ఆగష్టు 20 నుంచి 27 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 28న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఆగష్టు 30 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. సెప్టెంబర్ 13న ఈ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 16వ తేదీన కౌంటింగ్ పూర్తి కానుంది.
తెలంగాణలోని మెదక్ లోక్‌సభ స్థానానికి ఎన్నిక జరుగనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ రెండు స్థానాలకు పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన కొద్దిరోజులకే గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కొనసాగుతూ మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో నందిగామ, ఆళ్లగడ్డ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. అటు ఆళ్లగడ్డ స్థానంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేవలం నందిగామకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ఆళ్లగడ్డ స్థానంపై కోర్టు తీర్పు అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.




