హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు హైకోర్టు సానుకూలత వ్యక్తంచేసింది. ఇప్పటికిప్పుడు సర్వేను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చిందని పేర్కొంది. జీవో నంబరు 50లో ప్రభుత్వం అన్ని వివరాలు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు పేర్కొంది.




