Tuesday, 3 November 2026

‘భవిష్యత్‌లో సర్వే వివరాలు మార్చుకోవచ్చు’

హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ అన్నారు. ఇది ఆస్తుల సర్వేకాదని, కుటుంబాల సర్వే అనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. అవసరమైతే భవిష్యత్‌లో సర్వే వివరాలను మార్చుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే సర్వే వివరాలు ఇవ్వడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేదని, ఎక్కడివారక్కడే, ఏ ఊళ్లో ఉన్న వాళ్లు ఆ ఊళ్లో వివరాలు ఇస్తే సరిపోతుందని సూచించారు. సర్వేపై ఏవైనా ఫిర్యాదులుంటే ఈ-మెయిల్, కాల్ సెంటర్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. మీడియాతో సహా అన్ని అత్యవసర సేవల్లో ఉన్నవాళ్లు తమతమ కార్యాలయాల నుంచి లెటర్లు తీసుకోవాలని అన్నారు. చెక్‌లిస్టులు హైదరాబాద్‌లో మాత్రమే ఇచ్చామని వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *