న్యూఢిల్లీ, ఆగస్టు 21 : మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హైకమాండ్ నిర్ణయించింది. తెలంగాణలో మరో రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. తెలంగాణకు సంబంధించి మూడు జిల్లాలు మెదక్, రంగారెడ్డి, అదిలాబాద్‌లకు సంబంధించి జిల్లా డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఆదేశాలు జారీ చేశారు.
మెదక్ : జగ్గారెడ్డి, రంగారెడ్డి : కె. మల్లేష్, అదిలాబాద్ : దేశ్‌పాండేలకు డీసీసీ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరి జనార్థన్ ద్వివేది గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ ముగ్గురి నియామకం వెనుక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హస్తం ఉందనే చెప్పుకోవచ్చు.




