హైదరాబాద్: కోల్‌కతాలో జరుగుతున్న అంతర్జాతీయ వరి సదస్సుకు హాజరుకావడానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. అంతకు ముందు ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా సాంకేతిక పరిజ్ఞానం, మెలకువలు తెలుసుకోవడానికి కోల్‌కతా సదస్సుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో వరి సాగు చేసే రైతులకు అధిక ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు.




