హైదరాబాద్: తాను హెచ్ఆర్సీలో సభ్యురాలినని నమ్మబలికి ఉద్యోగాలిప్పిస్తానని మోసాలకు పాల్పడిన ఓ యువతిని మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆశాజ్యోతి అనే యువతి ఉద్యోగాలిప్సిస్తానని నమ్మబలికి పలువురు నిరుద్యోగుల నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.




