Tuesday, 3 November 2026

టీఎస్‌లోనే కొనసాగించాలని ముంపుగ్రామస్థుల ధర్నా

ఖమ్మం: పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతోన్న గ్రామాల ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని ఆందోళనకు దిగారు. ఈమేరకు ఇవాళ భద్రాచలం మండలం ఎటపాక వద్ద కన్నాయగూడెం, పిచ్చుకలపాడు తదితర ముంపు గ్రామాల ప్రజలు స్థానిక ఎంపీ సీతారాంనాయక్‌ను అడ్డుకున్నారు. తమ ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ముంపు మండలాలు తెలంగాణలోనే ఉండేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఎంపీ వారికి సర్దిచెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *