Tuesday, 3 November 2026

ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్: రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు న్యూఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఆయన నిర్వహిస్తోన్న జాతీయ గ్రామీణ తాగునీటి పథకం, నిర్మల్ భారత్ అభియాన్, ఐటీ ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం నిర్వహిస్తోన్న రెండు రోజుల సదస్సులో పాల్గొంటారు. కేటీఆర్ వెంట పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్, గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ విభాగం చీఫ్ ఇంజినీర్ సురేందర్‌రెడ్డి తదితరులు వెళ్లారు. రాష్ట్రంలో అమలులో ఉన్న తాగునీటి, పారిశుద్ధ్య నిర్వహణ ప్రాజెక్టుల ప్రగతి, నిధుల వినియోగం తీరును వివరించనున్నారు. రేపు జరిగే అన్ని రాష్ర్టాల ఐటీశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి చేపడుతోన్న చర్యలను కేటీఆర్ వివరించనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *