హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్థి ఎన్నిక బాధ్యత కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిదే అని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్ధిని రేపు ప్రకటిస్తామని దిగ్విజయ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఎవరైనా ఉండవచ్చని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ప్రభుత్వం వివక్ష చూపెడితే కాంగ్రెస్ అడ్డుకుంటుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రెండు రోజులపాటు నిర్వహించిన కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ సదస్సు మంగళవారం సోమవారం సాయంత్రం ముగిసింది.




