| ముంబై, ఆగస్టు 25 : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన ఆయనకు గుండె నాళల మార్పిడి చికిత్స చేయనున్నారు.
66 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంత కాలంగా హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే బీహార్ ఉప ఎన్నికల్లో కూడా కారులో వెళ్లకుండా హెలికాఫ్టర్లో ప్రయాణించారు. గుండెలో రెండు రక్త నాళాలు పూర్తిగా మూసుకుపోయాయని, వాటికి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో సోమవారం ముంబై వచ్చిన లాటూ ఏసియన్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి ఆపరేషన్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. |




