కొత్త గవర్నర్ల ఫైల్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు రాష్ట్రాల కొత్త గవర్నర్ల నియామక ఫైలుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించింది. కొత్త గవర్నర్ల జాబితాలో రాష్ట్రానికి చెందిన బీజేపి నేత సిహెచ్ విద్యాసాగర్ రావుకు సముచిత స్థానం లభించింది. మహారాష్ట్ర గవర్నర్‌గా బీజేపి ప్రభుత్వం ఆయనను ప్రతిపాదించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేసిన విద్యాసాగర్‌రావు పార్టీలో అనేక కీలక పదవుల్లో తన బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రాలు – కొత్త గవర్నర్లుగోవా – మృదులా సిన్హామహారాష్ట్ర – సీహెచ్ విద్యాసాగర రావుకర్నాటక – వీఆర్ వాలారాజస్థాన్ – కళ్యాణ్ సింగ్




