Monday, 2 November 2026

వై-ఫై నగరంగా హైదరాబాద్‌

మంత్రి కెటి రామారావు
 న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆగస్టు కల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని, హైదరా బాద్‌ను వై-ఫై నగరంగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటిశాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. దేశంలోనే హైదరాబా ద్‌ను మొదటి వైఫై నగరంగా తీర్చి దిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఇందుకుగాను పలు టెలికాం సర్వీసు ప్రొవైడర్లతో చర్చిస్తున్నామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మెట్రోపొలిటన్‌ ప్రాంతంలో వైఫై సర్వీసులు అందిం చడానికి అన్ని చర్యలు తీసుకుం టున్నామన్నారు. 2400 గ్రామపంచాయతీలను ఈ-పంచాయ తీలుగా మారుస్తున్నట్లు చెప్పారు. మంత్రి కెటి రామారావు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పెన్షన్లు ఈ-పంచా యతీల్లో ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. స్వచ్ఛ్‌ భారత్‌, స్వస్థ్‌ భారత్‌ నినాదం సముచితంగా వుందని కెటిఆర్‌ అన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలు ఫలవంతమ య్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం రూ.15 వేలు అదనంగా కేటాయించినట్లు ఆయన చెప్పారు. కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, రవిశంకర్‌ ప్రసాద్‌లతో తాను జరిపిన చర్చలు ఫలవంతమ య్యాయన్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలకు కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదని కేంద్రమంత్రిని కోరానని, అందుకు ఆయన సాను కూలంగా స్పందించారని, నిధులు పెంచడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఉపాధిహామీ పథకం కింద పనిదినాలు 120కి పెంచాలని కోరానన్నారు. అందుకు కూడా మంత్రి అంగీకరించారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *