న్యూఢిల్లీ, ఆగస్టు 27 : నేరచరితులైన మంత్రులను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. అయితే నేరచరితులు, అవినీతిపరులు మంత్రులు కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజ్యాంగ ధర్మకర్తగా ప్రధాని అలాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వరాదని, అలాంటి మంత్రులను మాత్రం అనర్హులుగా ప్రకటించలేమని థర్మాసనం స్పష్టం చేసింది.
పదేళ్ళ క్రితం నాటి ఈ పిటిషన్‌ను బుధవారం కోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని ప్రధాని విజ్ఞతకే వదిలివేస్తున్నామని ఐదుగురు సభ్యులు గల న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర కేబినెట్‌కు సంబంధించి నిర్ణయం తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రిదేనని సుప్రీం కోర్టు పేర్కొంది. మోదీ కేబినెట్‌లోని 14 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఒక్క ఉమాభారతిపైనే 13 కేసులు ఉన్నాయి.




