Tuesday, 3 November 2026

గుజరాతీని… వాణిజ్యం నా రక్తంలోనే ఉంది: ప్రధాని మోడీ

జపాన్‌: జపాన్‌ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 35 బిలియన్‌ డాలర్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌కు ఆర్థిక, సాంకేతిక సాయం చేసేందుకు జపాన్‌ అంగీకరించింది. భారత్‌, జపాన్‌ దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకుగాను భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో మూడోరోజైన సోమవారం ప్రధాని చాలా బిజీగా గడిపారు. ఉదయమే ఆయన జపాన్‌లోని ప్రధాన పారిశ్రామికవేత్తలతో బ’ాటీ అయ్యారు. తన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తామని, జపాన్‌నుంచి వచ్చిన ప్రతిపాదనలను సత్వరం పరిష్కరిస్తామని ఆయన వారికి తెలిపారు. ఈ బృందంలో ఇద్దరు జపానువారికీ అవకాశం ఇవ్వనున్నట్లు మోడీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గుజరాతీనని, వాణిజ్యం అనేది తన రక్తంలోనే ఉందన్నారు. వ్యాపారాలకు కావలసింది రాయితీలు కాదని, ప్రోత్సాహకరమైన వాతావరణమని మోడీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *