టోక్యో: కాలపరీక్షను తట్టుకొని నిలబడిన స్నేహం భారత్, జపాన్‌లదని ప్రధాని నరేంద్రమోడి అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ ఆ దేశ ప్రధాని షింజోఅబేతో పలుకీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ భారత్, జపాన్ రెండూ శాంతి కాముక దేశాలని అన్నారు. ఐదు కీలక అంశాలమీద ఇరుదేశాలు సంతకాలు చేశాయని తెలిపారు. ఆరోగ్యం, వారణాసి, క్యోటో, విధ్య అంశాలపై సంతకాలు చేసినట్టు పేర్కొన్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న బంధం పురాతనమైందని.. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రెండు దేశాలకు విశ్వ వేదికపై శక్తివంతమైన పాత్ర వహించే అవకాశముందన్నారు.




