హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే బంగారు తెలంగాణ సాధ్యమని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు స్పష్టం చేశారు. వివిధ పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ చేరిన సందర్భంగా ఆయన నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌తో కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు.




