Tuesday, 3 November 2026

‘ఇరురాష్ర్టాల్లో ఫీజులు సమానంగా ఉండాలి’

హైదరాబాద్: ఎంసెట్‌ను రెండురాష్ర్టాలు ఉమ్మడిగా నిర్వహించాయని, ఫీజులు కూడా సమానంగా ఉండాలని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్, సీఎంలకు ఓ లేఖ రాశారు. తెలంగాణలో వైద్య సీట్ల ఫీజులు పెంచుకునేందుకు అనుమతివ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని, విద్యార్థులపై భారం పడకుండా ఫీజులు తగ్గించాలని కోరారు. ఫీజుల పెంపు నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *