హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యద్భుత ఆర్కిటెక్చరల్ కళాఖండాలు, భారీ నిర్మాణాల జాబితాలో చోటు దక్కింది. అదేవిధంగా మెగా స్ట్రక్చర్ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రోకు స్థానం లభించింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న తొలి మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డ్ సృష్టించనుంది. ‘కనెక్టింగ్ ద సిటీ ఆఫ్ నిజామ్స్’ పేరుతో మూడు ఎపిసోడ్స్‌గా ప్రసారం సాగనుంది. అక్టోబర్ 19న సాయంత్రం 6 గంటలకు తొలి ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు నిర్వాహాకులు వెల్లడించారు.




