Tuesday, 3 November 2026

విద్యుత్‌లోటును పూడ్చేందుకు పక్కా ప్లాన్‌

అధికారులకు సిఎం కెసిఆర్‌ సూచన
రూ. 20వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆర్‌ఇసి
 హైదరాబాద్‌  : తెలంగాణలో ఏర్పాటుచేసే విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం రూ.20వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి రూరల్‌ ఎలక్ట్రిషికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఇసి) ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో స్థాపించే విద్యుత్‌ ప్రాజెక్టులు, అందుకోసం అవసరమైన వ్యయం, వనరుల సమీకరణ తదితర అంశాలపై సమీక్షాసమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌ఇసి సిఇఒ రాజీవ్‌ శర్మ, జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకరరావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటిఐఆర్‌ ప్రాజెక్టు, మంచినీటి గ్రిడ్‌ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నందున ఇప్పటికన్నా ఎక్కువ విద్యుత్‌ డిమాండ్‌ భవిష్యత్తులో

అవసరముంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికనుగుణంగానే తెలంగాణలో ప్రస్తుతమున్న 8 వేల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్‌ ప్లాంట్లకు అనుబంధంగా మరో 12వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేవిధంగా ప్రణాళిక చూపించినట్లు వెల్లడించారు. తక్షణం విద్యుత్‌ సమస్యలు అధిగమించడానికి స్వల్పకాలిక వ్యూహం, రాబోయే కొద్ది సంవత్సరాల అవసరాలు తీరేందుకు మధ్యతరహా కార్యక్రమాలు, రాబోయే పది పదిహేనేళ్ల పాటు విద్యుత్‌ కోత లేకుండా వుండే దీర్ఘకాలిక కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,700 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ వుంటే, 4,417 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులో వుందని అధికారులు వెల్లడించారు. చత్తీస్‌ఘర్‌ నుంచి 1000 మెగా వాట్లను, పిపిఎల ద్వారా మరికొంత విద్యుత్‌ సమకూర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. భూపాలపల్లి కెటిపిఎస్‌, జైపూర్‌ సింగరేణిలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల విస్తరణకు సంబంధించిన పనులను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. వచ్చే ఏడాది చివరి నాటికి 2,800 మెగావాట్ల విద్యుత్‌ అందు బాటులోకి వచ్చే విధంగా అధికారులు యుద్ధప్రాతి పదికన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. భూపాలపల్లిలో వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 600 మెగావాట్ల విద్యుత్‌, ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ ప్లాంటు ద్వారా సింగరేణి నుంచి 1200 మెగావాట్లు,, కేంద్రం వాటా కింద రావాల్సిన 1000 మెగావాట్లు వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి అందుబా టులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు విద్యుత్‌ అందుబాటులోకి వస్తే తెలంగాణలో విద్యుత్‌ కొరతను కొంతమేరకు అధిగమించవచ్చని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *