Tuesday, 3 November 2026

ముగిసిన ప్రధాని జపాన్ పర్యటన, స్మార్ట్ సిటీలు(పిక్చర్స్)

 న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకోని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీకి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. జపాన్ లో పర్యటించిన ప్రధాని పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసియా ఆర్దిక వ్యవస్దలో రెండు, మూడు స్దానాల్లో ఉన్న జపాన్ ఇండియా మధ్య భాగస్వామ్యం మరింత పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశ్యంగా మోడీ పర్యటన జరిగింది. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా జపాన్ వ్యాపారవేత్తలకు నరేంద్ర మోడీ ఆహ్వానం పలికారు. మౌలిక సదుపాయాలు, స్మార్ట్‌ సిటీల రూపకల్పన, బుల్లెట్‌ రైళ్లు వంటి అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. జపాన్‌, భారత పౌర అణు ఒప్పందం మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇక జపాన్‌లో నరేంద్ర మోడీ తన సహజసిద్ధ సంభాషణ శైలితో అక్కడి పౌరులను ఆకట్టుకోగలిగారు. మేడిన్‌ ఇండియా అంటూ జపనీస్‌ పెట్టుబడుదారులను భారత దేశానికి ఆహ్వానించారు. 100 స్మార్ట్ సిటీల ప్లాన్ త్వరలోనే సిద్దం ఎన్‌డీఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినున్న 100 స్మార్ట్ సిటీల అభివృద్ద ప్రణాళిక త్వరలోనే తుది దశకు చేరుతుందని కేంద్ర బుధవారం వెల్లడించింది. స్మార్ట్ సిటీల అభివృద్దిలో ప్రైవేటు సెక్టార్ పాలుపంచుకోవచ్చని, అందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *