
చెన్నై: చెన్నైలోని పోర్టిస్ మలార్ ఆసుపత్రి వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అతను మరణించగానే అక్కడి వైద్యులు అతని గుండెను శరీరం నుంచి వేరు చేసి చెన్నైలోని పోర్టిస్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.
దీంతో పోర్టిస్ ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం వేచిచూస్తున్న రోగికి గుండె మార్పిడి చేసేందుకు సన్నాహాలు చేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గుండెను చెన్నై నగరానికి సురక్షిత పద్దతిలో తీసుకువచ్చారు. గుండె పనిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుండె రాగానే చెన్నై పోలీసుల సాయంతో విమానాశ్రయం నుంచి ఆసుపత్రి మార్గంలో ట్రాఫిక్ మళ్లించి రోగికి శస్త్రచికిత్స ప్రారంభించారు.




