Tuesday, 3 November 2026

కేసీఆర్ క్యాంపు ఆఫీసును వదలని వాస్తు దోషం!

హైద‌రాబాద్‌(జ‌నంసాక్షి):

తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసును వాస్తు దోషం వదలట్లేదు. వాస్తు లోపాల కారణంగా క్యాంప్ కార్యాలయం షిఫ్ట్ కానున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌ను మరో భవనంలోకి మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
ప్రస్తుత క్యాంప్ ఆఫీస్‌ను స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ స్వీకారం చేసిన తర్వాత క్యాంప్ ఆఫీస్ మారడం ఇది రెండవసారి కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *