హైదరాబాద్(జనంసాక్షి)
కమల్‌నాథన్ కమిటీతో టీఎన్జీవో నేతలు భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్యాడర్ స్ట్రెన్త్ తప్పుల తడకగా ఉందని అన్నారు. పున:పరిశీలించి మరోసారి ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా ఉద్యోగుల శాశ్వత విభజన చేయాలని కోరారు. అంగన్‌వాడి, జిల్లా స్థాయి, ఔట్ సోర్స్ ఉద్యోగులను.. క్యాడర్‌లో చేర్చడం సరికాదని టీఎన్జీవో దేవీప్రసాద్ సూచించారు.




