Tuesday, 3 November 2026

మెదక్‌లో బీజేపీకి ఓటమీఖాయం: మంత్రి హరీష్‌రావు

మెదక్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోక తప్పదని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చినపుడే బీజేపీ ఓటమీ ఖాయమైపోయిందని అన్నారు. పార్టీ తరపున అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఇవాళ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఇవాళ మెదక్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈమేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాకుండా చేసి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *