న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని జాతీయ నేతలను కలిసి కోరుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఈ మధ్యాహ్నం 1.15 గంటలకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. 2 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమవుతారు. 2.30 గంటలకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలువనున్నారు. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై రాష్ట్ర సమస్యలను వివరించనున్నారు.




