హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ జయశంకర్ వర్సిటీలో ఇంజినీర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని అన్నారు. దేశంలో ఏ రాష్ర్టానికి లేని అవకాశం తెలంగాణకు ఉందని తెలిపారు. పరిశ్రమల కోసం 10 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉందని స్పష్టం చేశారు. త్వరలో రాష్ర్టానికి కోట్లు పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. దేశంలో రెండో అతిపెద్ద పారిశ్రామిక నగరంగా హైదరాబాద్‌ను గుర్తించారని అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధికి చాలా అవకాశముందని తెలిపారు. ఇతర రాష్ర్టాలు మనకు పోటీ కాదని.. ఇప్పటికే మనం 40 శాతం పట్టణీకరణతో ఉన్నామని తెలిపారు.




