హైదరాబాద్: రాగల 24 గంటల్లో తెలంగాణ, ఏపీలో పలుచోట్ల వానలు కురిసే అవకాశమున్నట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ, కోస్తాంధ్రలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది.




